సావిత్రిబాయిపూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: సావిత్రిబాయిపూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలంతా ఉపాధ్యాయ వృత్తిని ప్రేమిస్తూ నిరంతరం విద్యాభివృద్ధికి, తద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరచారి అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో మాట్లాడారు. సావిత్రిబాయి పూలే సామాజిక కట్టుబాట్లను ఎదిరించి బాలికా విద్యకు ఎంతో తోడ్పడిందని, తద్వారా నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిందని, ఆమె చూపించిన ధైర్యాన్ని తెగువని స్ఫూర్తిగా తీసుకొని నేటి మహిళా ఉపాధ్యాయులంతా వారి వృత్తికి పునరంకితమవుతూ విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ చేయనున్న 38 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్.మాధవరావు, ఎం.సతీశ్‌కుమార్, ఎ.నాగరాజశేఖర్, జె.అన్నామని, ఎస్‌కే సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment