తెరచుకోని పల్లె దవాఖానా
దమ్మపేట: మండలంలోని దమ్మపేట మార్కెట్ యార్డు శివారులో ఉన్న పల్లె దవాఖానా శుక్రవారం ఉదయం 10.45 గంటలైనా తెరుచుకోకపోగా తాళం వేసి ఉంది. మండల కేంద్రానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వైద్యం అందించాలనే ఆశయంతో నిర్మించిన పల్లె దవాఖానాలో వైద్య సేవలు కొరవడ్డాయి. ఈ దవాఖానా పరిధిలో దాదాపు నాలుగు వార్డులకు చెందిన పేద ప్రజలు ఉన్నారు. దవాఖానాకు తాళం వేసి ఉండటంతో దీని పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇలా గతంలో కూడా పలుమార్లు జరిగినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ దవాఖానా ప్రాంగణం ఎదుట ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు.. ఇతర వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. పేద ప్రజల కోసం నిర్మించిన ఈ దవాఖానా సిబ్బంది సమయపాలన పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment