ముక్కోటికి సిద్ధం
భద్రాచలం: భద్రాచలంలో గురువారం జరిగే తెప్పోత్సవం, శుక్రవారం తెల్లవారుజామున జరిగే ఉత్తర ద్వార దర్శనాలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. బుధవారం గోదావరి తీరం, ఉత్తర ద్వార దర్శనం, స్టాళ్లు ఏర్పాటు తదితర ప్రదేశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర ద్వార దర్శనం రోజున అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచే విధుల్లో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు సైతం మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది చేపట్టిన ఏరు ఉత్సవాన్ని ఆదివాసీల కార్యక్రమంగా రూపొందించామని తెలిపారు. బుధవారం నుంచి 11వ తేదీ వరకు గిరిజన కల్చరల్ ప్రోగ్రామ్స్ గోదావరి తీరంలో వేదికపై ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. గిరిజన వంటకాలు, గోదావరిలో బోట్ సౌకర్యం, ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియం పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గోదావరి పక్కన ప్రత్యేక క్యాంపెయింగ్ ఏర్పాటు చేశామని, ఇది కొనసాగింపు కార్యక్రమంలా మారుస్తామని వెల్లడించారు. రివర్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ దామోదర్ రావు, రామాలయ ఈఓ రమాదేవి, భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు తెప్పోత్సవం,
రేపు ఉత్తర ద్వార దర్శనం
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment