తుమ్మల చెరువులో బోటింగ్..
అశ్వాపురం: కాకతీయుల కాలంనాటి తుమ్మల చెరువు పర్యాటక ప్రాంత అభివృద్ధిలో నేడు తొలి అడుగు పడనుంది. గురువారం తుమ్మలచెరువులో బోటింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించనున్నారు. ప్రసిద్ధి చెందిన తుమ్మల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. స్థానికుల విన్నపం, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో తుమ్మల చెరువు పర్యాటకాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కాగా సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మల చెరువుకు గోదావరి జలాలు అందించనున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయి గోదావరి జలాలు తరలిస్తే చెరువులో 365 రోజులపాటు నీరు పుష్కలంగా ఉంటుంది. ఆయకట్టు 10 వేల ఎకరాల్లో రెండు పంటలతోపాటు ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేందే అవకాశం ఉంది.
నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment