సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు 3,704 సర్వీసులు మంజూరు చేశామని, డిసెంబర్‌లోనే 428 కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఆన్‌లైన్ చేయడంతో వ్యవసాయ సర్వీసుల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని నివారిస్తున్నట్లు తెలిపారు. ఈ–స్టోర్ విధానం ద్వారా మెటీరియల్‌ను ఆన్‌లైన్ ద్వారా రిజర్వ్ చేసుకోగానే మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు మరింత చేరువయ్యేలా పొలంబాట కార్యక్రమం చేపట్టామని వివరించారు.
ఖాళీ ప్రదేశాల్లోనే పతంగులు ఎగురవేయాలి
విద్యుత్‌లైన్లకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్ తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎగురవేస్తే మాంజా దారాలు వాటిపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనా మాంజాలు అసలు వాడొద్దని తెలిపారు.
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment