ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏరు ఉత్సవాని(రివర్ ఫెస్టివల్)కి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆదివాసీల ఆచారవ్యవహారాలు తెలిసేలా రెండు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రదేశాల్లో ఆదివాసీల వస్తువులు, కట్టడాలు, వంటకాలతో పల్లె తరహాలో ఏర్పాటు చేశారు. పర్యాటకుల సందర్శనకు బొజ్జిగుప్ప, కిన్నెరసాని, బెండాలపాడుతో పాటు ఐటీడీఏ గిరిజన మ్యూజియంలో, గోదావరి తీరంలో విడిది గృహాలను, ఆదివాసీ వంటకాలను వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. నదీ విహారానికి బోట్లు అందుబాటులో ఉంచారు. తీరంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజీ సిద్ధం చేశారు. స్నాన ఘట్టాల ప్రాంతంలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి ఆదివాసీల వస్తువులు, వంటకాలను సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల మహిళల ద్వారా విక్రయించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్యాకేజీగా రూ.6 వేలు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment