భారీ బందోబస్తు
భద్రాచలంఅర్బన్: తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. బుధవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గోదావరి తీరం, దేవాలయ ప్రాంగణం, బస్టాండ్, ప్రధాన రహదార్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్‌కు అనుమతించాలన్నారు. వేడుకల్లో 1,300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఒక అడిషనల్ ఏఎస్పీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 917 మంది సివిల్, 6 స్పెషల్ పార్టీలు, 6 సెక్షన్లకు చెందిన 11 సీఆర్‌పీఎఫ్ బృందాలు, 4 బీడీ టీంలతో కలిపి మొత్తం 1,300 మంది బందోబస్తులో పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment