వారి ‘సంకల్పం’ ఆకట్టుకుంది.. | - | Sakshi
Sakshi News home page

వారి ‘సంకల్పం’ ఆకట్టుకుంది..

Published Mon, Jan 20 2025 12:28 AM | Last Updated on Mon, Jan 20 2025 12:28 AM

వారి ‘సంకల్పం’ ఆకట్టుకుంది..

వారి ‘సంకల్పం’ ఆకట్టుకుంది..

●ప్రకృతి వ్యవసాయంపై మహిళా కళాకారుల బృందం ప్రత్యేక ప్రదర్శన ●అలరించిన శ్రీముఖి కూచిపూడి నృత్యం

ఖమ్మంగాంధీచౌక్‌: వర్షాలు లేక, పంటలు పండక, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనల నేపథ్యాన ఓ కూతురు.. తండ్రి వ్యవసాయ వారసత్వాన్ని తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేసి ఆదర్శరైతుగా గుర్తింపు పొందటంతో పాటే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటం ఇతి వృత్తంగా ప్రదర్శించిన సంకల్పం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 90వ అభ్యుదయ సాంస్కృతిక కదంబంగా విశాఖపట్టణానికి చెందిన జాస్మిన్‌ ఆర్ట్స్‌ కల్చరల్‌ ఈవెంట్స్‌ కళా బృంధం నాటికను ప్రదర్శించింది. రావి నాగేశ్వరరావు రచించిన నాటికకు సంధ్యా ప్రియదర్శిని దర్శకత్వం వహించారు. నాటికను పూర్తిగా మహిళా కళాకారులు సంధ్యా ప్రియదర్శిని, సీతామహాలక్ష్మి, వరలక్ష్మి, శివజ్యోతి, సుజాత ప్రదర్శించారు. కాగా, నెల నెలా వెన్నెల సాంస్కృతిక కార్యక్రమంలో భద్రాచలానికి చెందిన వనం శ్రీముఖి ప్రదర్శించిన శాసీ్త్రయ కూచిపూడి నృత్యం ప్రేక్షకులను రంజింపజేసింది. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రీముఖి ‘యదువంశ సుదాంబుజ రారా’గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. విద్యావేత్త, రచయిత రవిమారుత్‌ శ్రీముఖిని అభినందించారు. కార్యక్రమంలో జల్లా లక్ష్మీనారాయణ, తిరుమలాచార్యులు, డాక్టర్‌ వనం కృష్ణవేణి, మోటమర్రి జగన్మోహన్‌రావు, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్‌, డాక్టర్‌ నాగబత్తిని రవి, దేవేంద్ర, సదానందం, లక్ష్మీనారాయణ, మొగిలి గుణకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement