విద్యార్థులకు మెరుగైన వసతులు
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు వాతావరణం మార్పు వల్ల అనారోగ్యానికి గురి కాకుండా మెరుగైన వసతులు కల్పించి పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్‌లో భాగంగా ఆయన పలువురి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. కాగా, పోడు సమస్య, జీవనోపాధికి వ్యక్తిగత రుణాల, వ్యవసాయ భూములకు విద్యుత్ మోటార్ల మంజూరు, గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, కులాంతర వివాహితులకు ప్రోత్సాహక నగదు మంజూరు తదితర అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. అనంతరం అధికారులతో సమావేశమైన పీఓ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు పథకాలు వర్తించేయాలని సూచించారు. అలాగే, వసతిగృహాలు, గురుకులాల్లోని విద్యార్థుల విషయమై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, వివిధ శాఖల అధికారులు నాగార్జునరావు, సున్నం రాంబాబు, లక్ష్మీనారాయణ, పవర్ వేణు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్‌రావు, ఆదినారాయణ, అనసూయ, అశోక్‌కుమార్, మణిధర్, నారాయణరావు పాల్గొన్నారు.
కొత్త ప్రాజెక్టులకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలోని షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల నుంచి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు పీఓ బి.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు www. ngo.tribal.gov.in పోర్టల్ ద్వారా ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment