సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భఽరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికకు మంగళవారం నుంచి ఈనెల 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టెంట్లు, మైక్‌సెట్‌లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సభల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను వివరించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎస్‌ఓ రుక్మిణి, హౌసింగ్ పీడీ శంకర్, డీఏఓ బాబూరావు, డీపీఓ చంద్రమౌళి, ఏఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
వివాదాస్పద భూముల పరిశీలన
చుంచుపల్లి: చుంచుపల్లి తండా బైపాస్ సమీపంలోని ఐటీఐ కాలేజీ దగ్గర వివాదంలో ఉన్న భూములను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం పరిశీలించారు. స్థానిక గిరిజనుడు అంగోత్ భాస్కర్ కుటుంబ సభ్యులకు సర్వే నంబర్ 19/1 నుంచి 19/6లో గల 13.26 ఎకరాల భూమి ఉండగా గిరిజనేతరులు కబ్జాకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భాస్కర్ జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తున్న తరుణంలో వ్యవసాయ భూములను పరిశీలించిన కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పత్రాలను పరిశీలించి సమగ్ర నివేదికను నేషనల్ ఎస్టీ కమిషన్‌కు పంపించి గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఆయన వెంట చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment