మారథాన్ పోటీల్లో తహసీల్దార్ ప్రతిభ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్ ఆదివారం ముంబైలో నిర్వహించిన మారథాన్ పోటీల్లో ప్రతిభ చాటారు. 42.195 కి.మీ. దూరాన్ని 5 గంటల 13 నిమిషాల 35 సెకన్లలో పూర్తిచేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం అవసరమని అన్నారు. ప్రసాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ కూడా ప్రసాద్‌ను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రమాదేవి, ఎలక్షన్ సెల్ అధికారులు, ఉద్యోగులు రంగాప్రసాద్, శ్రీనివాసయాదవ్, సాయికృష్ణ, రామకృష్ణ, నవీన్, నజీర్, సంపత్ పాల్గొన్నారు.
అభినందించిన కలెక్టర్ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment