● ముగియనున్న మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ● ఐదేళ్లలో
2020, జవవరి 27న కొలువుదీరిన
పాలకవర్గాలు
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా, పాలకవర్గాలు అదే నెలలో 27న కొలువుదీరాయి. కొత్తగూడెంలో 36 వార్డులుండగా బీఆర్‌ఎస్ 29, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 2, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ నుంచి కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్‌గా దామోదర్ ఎన్నికయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా బీఆర్‌ఎస్ 21, రెబల్ 1, న్యూడెమోక్రసీ, సీపీఐ ఒక్కోటి చొప్పున గెలిచాయి. చైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా జానీపాషా ఎన్నికయ్యారు.
కార్పొరేషన్‌తో కౌన్సిలర్లు అయోమయం
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా కౌన్సిలర్లు ఐదేళ్ల పాలనలో వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తమ మార్కు చూపెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయసమేననే భావనలో ఉన్నారు. కార్పొరేషన్ ప్రకటనతో వారిలో అయోమయం మొదలైంది. ఇప్పుడున్న 2,3 వార్డులు కలిపి కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌గా మారే అవకాశం ఉందని, దీంతో కార్పొరేటర్‌గా గెలుస్తామో, లేదోననే అభిప్రాయంలో ఉన్నారు. మరికొందరు ఇప్పటి నుంచే పక్కన వార్డులపైనా దృష్టి పెట్టారు. వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ అక్కడివారితో కూడా ఆత్మీయంగా మెలుగుతున్నారు. కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు, ఎన్నికల ఖర్చుపై ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. ఇటీవల పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్, సీపీఐ పార్టీల్లో చేరారు. చేరికల పర్వం కొనసాగితే కాంగ్రెస్, సీపీఐ బలం పుంజుకునే అవకాశం, బీఆర్‌ఎస్ నాయకత్వం కట్టడి చేస్తే మూడు పార్టీలకు సమానబలం ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment