కొత్తగూడెంటౌన్: గాయాలకు కారణమైన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2017లో బందగిరి నగర్‌కు చెందిన పూనెం పాపారావు కుమారుడు సురేష్, అతని స్నేహితుడు లోడిగి బుచ్చిరాములు వెంకటాపురానికి బైక్‌పై వెళ్తూ కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్దకింద పడ్డారు. దీంతో సురేష్‌కు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బుచ్చి రాములుకు కూడా గాయాలయ్యాయి. కాగా తన కుమారుడు సురేష్ మృతిపై అనుమానం ఉందని పాపారావు కరకగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నూప రామ్, నూప సతీష్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో రామ్ చనిపోవడంతో అతనిపై కేసు కొట్టివేశారు. నూప సతీష్‌పై హత్యా నేరం రుజువు కాలేదు. గాయాలు చేసినట్లు రుజువు కావడంతో రెండేళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. సిబ్బంది జి. ప్రవీణ్, ఎన్. వీరబాబు, మాలోతు ఈశ్వర్ సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment