పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
టేకులపల్లి: పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బేతంపూడిస్టేజీలో సోమవా రం జరిగిన బీఆర్‌ఎస్ టేకులపల్లి మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియతో కలిసి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లెందు నియోజకర్గంలోని 138 పంచాయతీల్లో తమ పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎక్ర్‌ట్రాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారు ల జాతకాలు పింక్ బుక్‌లో పొందుపరుస్తున్నామని అన్నారు. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పింక్ బుక్ తెరుస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ పాలకులు సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బెదిరింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ను రోళ్లపాడుకు తెచ్చేందుకు అన్ని మంజూరులు సాధిస్తే నేటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఇక్కడి రైతులు నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పరిస్థితి వార్డు మెంబర్‌కు ఎక్కువ, సర్పంచ్‌కు తక్కువలా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సమస్యలపై సీఎం, మంత్రులతో చర్చించే సీన్ లేదని ఆరోపించారు. వాళ్ల వెంట ఉన్నవారికే కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు దిండిగల రాజేందర్, లక్కినేని సురేందర్‌రావు, మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు, చీమల సత్యనారాయణ, బాలకృష్ణ, రవి, కిషన్, రామ, శివ, పూల్‌సింగ్, రేణుక, బాలాజీ, వస్రాం, కిరణ్, రాజా తదితరులు పాల్గొన్నారు.
ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకుంటాం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
Comments
Please login to add a commentAdd a comment