ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాల్సిందే..
పాల్వంచ: టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న సుమారు 23వేల మంది ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసి పర్మినెంట్ చేయాలని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎం.ఏ.వజీర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలోని ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యాన పాల్వంచలోని స్థానిక కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్హత ఆధారంగా స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేయాలని, చట్టప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి ఇంక్రిమెంట్, గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. కానీ పదేళ్లు దాటినా యాజమాన్యాలు పదోన్నతులు కల్పించకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం సరికాదన్నారు. ఈనెల 24వ తేదీ వరకు కొనసాగే దీక్షలతో స్పందన రాకపోతే ఫిబ్రవరి 3వ తేది నుండి 13వరకు జిల్లా పర్యటనలు, 20న చలో విద్యుత్ సౌధ ముట్టడి నిర్వహిస్తామని వెల్లడించారు. దీక్షలో ఆర్టిజన్ నాయకులు టి.రమేష్, టి.త్రినాధ్, జీ.వీరస్వామి, వి.సాయికిరణ్, బి.మధుకుమార్, కన్నయ్య, సైదులుబాబు, కృష్ణ, రమేష్, శంకర్,యాకయ్య, రమేష్, ప్రవీణ్, సుధాకర్, అబ్దుల్ కరీం, మహేష్, కె.కృష్ణ పాల్గొనగా వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులు ముత్యాల విశ్వనాధం, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, సాయిబాబా, బానోతు శంకర్, అంకిరెడ్డి నర్సింహారావు, రాధాకృష్ణ, రాము, రాజేంద్ర సంఘీభావం తెలిపారు.
కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లో
రిలే దీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment