గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
ఇల్లెందు : ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఇల్లెందులో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని జేబీ ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు పిల్లి రమేష్ (50) మూడు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఖమ్మంలో నివాసం ఉండే ఆయన సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. ఇల్లెందులో బస్సు దిగగానే ఛాతీలో నొప్పి రావడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్ చేయించుకుని పాఠశాలకు వెళ్లాడు. గంట తర్వాత మళ్లీ నొప్పి ఎక్కువ కావడంతో సహచర ఉపాధ్యాయులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేస్తుండగానే మృతి చెందాడు. మృతుడి భార్య కూడా ఉపాధ్యాయురాలే కాగా, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇల్లెందు ఎంఈఓ టీవీఆర్‌ఎన్ స్వామి, సహచర ఉపాధ్యాయులు మృతదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్...
మంగపేట: అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా మంగపేట మండలం మొట్లగూడెం సమీపాన జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముత్యాలమ్మపేటకు చెందిన ప్రశాంత్(25) ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహాసాగర్‌లో రైతు తాటి సమ్మయ్యకు చెందిన జామాయిల్ కలప తీసుకుని సారపాక ఐటీసీ పీఎస్‌పీడీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. ఈక్రమాన మొట్లగూడెం సమీపాన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడగా ప్రశాంత్ ట్రాక్టర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై టీవీఆర్.సూరి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ప్రశాంత్‌కు తల్లి నాగమణి, సోదరుడు ఉండగా ఆయన తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment