భద్రాచలంఅర్బన్ : పోలీసులు సోమవారం ముగ్గురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రెవెన్యూ కాలనీకి చెందిన ధరణిశివకు బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లోజి గణేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.4 లక్షల నగదు ఇచ్చారు. వీరికి పాప ఉంది. ధరణిని కొంతకాలంగా ఆమె భర్త గణేష్, మామ శ్రీను, అత్త లక్ష్మి అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. వేధింపులు భరించలేక ఏడాది క్రితం నుంచి ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల తర్వాత అక్కడకు వచ్చిన భర్త మళ్లీ వేధిస్తున్నాడు. పాపను చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment