నిర్మాణంలో మినీ ‘స్టే’డియం! | - | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!

Published Tue, Jan 21 2025 12:54 AM | Last Updated on Tue, Jan 21 2025 12:54 AM

నిర్మ

నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!

●రెండేళ్ల క్రితం జిల్లాకు ఐదు క్రీడా మైదానాలు మంజూరు ●ఇల్లెందు, మణుగూరులో ముందుకు సాగని పనులు ●భద్రాచలం, అశ్వారావుపేటలో ఎట్టకేలకు స్థల సేకరణ పూర్తి ●పాల్వంచలో మాత్రం 90 శాతం మేర పూర్తయిన నిర్మాణ పనులు

కొత్తగూడెంటౌన్‌: మినీ స్టేడియాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున ప్రభుత్వం ఐదింటిని మంజూరు చేసింది. వీటిలో ఇంకా రెండింటి నిర్మాణ పనులే ప్రారంభంకాలేదు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2023 మినీ స్టేడియాల నిర్మాణానికి ఉపక్రమించింది. పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, ఆశ్వారావుపేటలలో వీటి ఏర్పాటుకు నిర్ణయించింది. ఒక్కో స్టేడియానికి రూ.2.10 కోట్ల నుంచి రూ.2.60 కోట్ల వరకు కేటాయించింది.

ఇల్లెందులో..

ఇల్లెందులో మినీ స్టేడియానికి రూ.2.17 కోట్లు కేటాయించారు. రూ.1.40 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.67.53 లక్షల పనులు చేపట్టాల్సి ఉంది. ఆఫీస్‌ బిల్డింగ్‌, ఇండోర్‌ స్టేడియం రూంలు, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, జిమ్నాస్టిక్స్‌ రూమ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండోర్‌ షటిల్‌ కోర్టు, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌, 200 మీటర్ల అథ్లెటిక్స్‌ ట్రాక్‌, వాలీబాల్‌, ఖోఖో, ఫుట్‌ బాల్‌ కోర్టులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కాంపౌండ్‌ వాల్‌, మెయిన్‌గేట్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది.

మణుగూరులో..

పినపాక(మణుగూరు)లో మినీ స్టేడియం కోసం రూ.193.24 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.118.85 లక్షల పనులు పూర్తి కాగా, రూ.66.32 లక్షల పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆఫీస్‌ బిల్డింగ్‌, ఇండోర్‌ స్టేడియం రూములు, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, జిమ్నాస్టిక్స్‌ రూమ్స్‌ పూర్తి కాగా ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌, 200 మీటర్ల అథ్లెటిక్స్‌ ట్రాక్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో కోర్టులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కాంపౌండ్‌ వాల్‌, మెయిన్‌గేట్‌ తదితర నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది.

భద్రాచలంలో..

భద్రాచలంలో మినీ స్టేడియం నిర్మాణ స్థల సేకరణకు దాదాపు రెండేళ్లకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు అధికారులు అనువైన స్థలాన్ని గుర్తించి భూ సేకరణ పూర్తి చేశారు. మినీ స్టేడియానికి దాదాపు రూ.2.65 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది.

అశ్వారావుపేటలో..

అశ్వారావుపేటలో మినీ స్టేడియానికి దాదాపు రూ.2.65 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత అశ్వారావుపేటలో 5.02 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

పాల్వంచలో..

పాల్వంచ శ్రీనివాసకాలనీలో రూ.2.10 కోట్లతో మినీ స్టేడియం పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.1.20 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.90.12 లక్షల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మెయిన్‌ ఇండోర్‌ స్టేడియం, డీవైఎస్‌ఓ ఆఫీస్‌ బిల్డింగ్‌, క్యారమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ రూమ్స్‌, జిమ్నాస్టిక్స్‌ రూమ్స్‌, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయ్యాయి. షటిల్‌ కోర్టులు, ఫ్లోరింగ్‌, పుట్‌బాల్‌ కోర్టు, ఎంట్రీ గేట్‌ అండ్‌ నేమ్‌ బోర్డు, 200 మీటర్ల ట్రాక్‌, వాలీబాల్‌, ఖోఖో కోర్టులు, సెప్టిక్‌ ట్యాంక్‌, వాటర్‌ట్యాంక్‌లు, ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ పూర్తి కావాల్సి ఉంది.

ప్రణాళికలు తయారు చేశాం

ఐదు మినీ స్టేడియాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాల్వంచలో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మరో రెండింటి పనులు చివరి దఽశలో ఉన్నాయి. భద్రాచలం, అశ్వారావుపేటలలో స్థల అడ్డంకులు తొలగిపోయాయి. పనులు ప్రారంభిస్తాం. –పరంధామరెడ్డి,

జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!1
1/2

నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!

నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!2
2/2

నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement