రావికంపాడులో పోడు వివాదం
చండ్రుగొండ : మండలంలోని రావికంపాడు గ్రామశివారు అటవీప్రాంతంలో ఫారెస్టు అధికారులు చేపట్టిన కందకం పనులను గిరిజనులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోడు పట్టాలున్న తమ భూముల మధ్య నుంచి కందకం తీస్తున్నారని పోడు సాగుదారులు పేర్కొంటున్నారు. మ్యాప్ ప్రకారం అటవీ సరిహద్దులోనే కందకం పనులు చేస్తున్నట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. పోడుపట్టాలున్న భూములను మినహాయించే కందకం తీస్తున్నామని, అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందిగా ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శివరామకృష్ణ హెచ్చరించారు. దీంతో గిరిజనులు వెనక్కుతగ్గారు. చండ్రుగొండ, జూలూరుపాడు, కొత్తగూడెం ఎఫ్‌ఆర్‌ఓలు ఎల్ల య్య, ప్రసాదరావు, శ్రీనివాసరావు, ఫారెస్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కందకం పనులను అడ్డుకున్న గిరిజనులు
Comments
Please login to add a commentAdd a comment