కొత్తగూడెంటౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సెంటర్‌లో ఉచిత శిక్షణ కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి పి.పరందామరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారే అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్పోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లను దరఖాస్తులకు జత చేయాలని వివరించారు. ఎంపికై న క్రీడాకారులకు ఖేలో ఇండియా సెంటర్ రెసిడెన్షియల్‌లో ఉచిత శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment