‘బాలవెలుగు’కు సొంత భవనం
మణుగూరు టౌన్ : పట్టణంలోని సంతోష్‌నగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న బాలవెలుగు పాఠశాలకు సొంత భవనం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కలెక్టర్‌తో మాట్లాడుతానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి హామీ ఇచ్చారు. బుధవారం ఆమె పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వసతి సౌకర్యం, చదువు, క్రీడల వంటివి ఎలా ఉన్నాయని ఆరా తీశారు. గత 13 ఏళ్లుగా గొత్తికోయలు, గిరిజన బాల కార్మికులను చేరదీసి 1,450 మంది విద్యార్థులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని పాఠశాల నిర్వాహకులు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతరం భానుమతి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ న్యాయవాది నిరంజన్‌రావు, మణుగూరు లీగల్ ఎయిడ్ న్యాయవాది అంకం సర్వేశ్వరరావు, న్యాయవాది విజయరావు, నాగేంద్రబాబు, షాహీన్, బాడిస భిక్షం, జానకీరామ్, రామకృష్ణ, సింగరేణి సేవా సమితి సభ్యులు నాజర్‌పాషా, కిరణ్, సిబ్బంది సుహాసిని పాల్గొన్నారు.
వృద్ధులకు ఉచిత న్యాయసేవలు..
అశ్వాపురం : మండలంలోని సీతరాంపురం మానవీయ వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధులకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు తాము ఎల్లవేళలా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి రమేష్‌బాబు, కమటం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దైదా నారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి అసా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి భానుమతి హామీ
Comments
Please login to add a commentAdd a comment