అటవీ సంపదను రక్షిద్దాం
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అటవీ సంపదను కాపాడుకుందామని, ఇందుకోసం ప్రతీ ఒక్కరు సహకరించాలని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి శివారులోని బ్యాంబో ప్లాంటేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు 100 హెక్టార్లలో చేపట్టిన వెదురు ప్లాంటేషన్‌ను, బేస్‌క్యాంప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెదురు ప్లాంటేషన్ కోతకు అనుమతి కోసం ఉన్నతధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. సిబ్బంది మరింత మెరుగ్గా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, రేంజర్ ఎల్లయ్య, వీఎస్‌ఎస్ చైర్మన్ సీహెచ్ రాములు, సభ్యులు వడ్డేపల్లి బాబు, చల్లా లక్ష్మణ్‌రావు, నీలం రాములమ్మ, రుంజా ముత్యం పాల్గొన్నారు.
బుద్ధ గుహలను
సందర్శించిన ఫ్రాన్స్ యువతి
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం గుట్టలపై ఉన్న బుద్ధుడి విగ్రహాలను ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతి సోలెన్ బుధవారం సందర్శించారు. ఫ్రాన్స్‌లోని ఇనాల్కో యూనివర్సిటీలో తెలుగు, సంస్కృతం భాషలను నేర్చుకుంటున్న ఆమె హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు చదువుతోంది. ఈనేపథ్యాన పుస్తకాల్లో కారుకొండ రామవరం గుట్టలు, బుద్ధుడి విగ్రహాల సమాచారం తెలుసుకున్న సోలెన్ విజయవాడ మీదుగా ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు బుద్ధిస్ట్ సొసైటీకి చెందిన కమలారాణి ఇక్కడి చారిత్రక ప్రత్యేకతలను ఆమెకు వివరించారు.
జిల్లా కోర్టులో క్రీడా పోటీలు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. లెమన్‌స్పూన్ రన్, మ్యుజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఏర్పాటుచేయగా పలువురు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి పాటిల్ వసంత్ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఎ.సుచరిత, కె.సాయిశ్రీ, బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, తోట మల్లేశ్వరరావు, దూదిపాల రవికుమార్, సాధిక్‌పాషా, గాజుల రామ్మూర్తి, పి.నాగేశ్వరావు, వేల్పుల సుధాకర్, జీకే అన్నపూర్ణ, ఎస్.భానుప్రియ, ఎ.మహాలక్ష్మీ, జి.సునంద, మల్లెల ఉషారాణి పాల్గొన్నారు.
మెరుగైన వైద్య
సేవలందించాలి
ఇల్లెందురూరల్ : ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన రొంపేడు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మందుల నిల్వ, ఇన్‌పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సబ్‌సెంటర్ల పనితీరు మెరుగు పడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ, వైద్యాధికారులు కవిత, మురళీకృష్ణ తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment