పూబెల్లికి సరికొత్త అందాలు
● పర్యాటకంలో అగ్రగామిగా నిలుపుదాం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
ఇల్లెందురూరల్: సహజ సిద్ధమైన అందాలున్న పూబెల్లికి పర్యాటక హంగులతో సరికొత్త అందాలు వచ్చేలా చేద్దామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని పూబెల్లి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న ప్రణాళిక ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనకు విభాగాల వారీగా కమిటీలు వేయాలని, ఆయా సభ్యులు వారం రోజులు శ్రమిస్తే పనులు పూర్తవుతాయని చెప్పారు. విడిది స్థలానికి వాహనాలు వెళ్లేలా గ్రావెల్ రోడ్డు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులో బోటింగ్‌కు అవసరమైన లాంచీని సమకూర్చడంతో పాటు పర్యాటకులకు ఆదివాసీ సంప్రదాయ ఆహారం అందించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓ, తహసీల్దార్ వరకు అందరూ ఈ పనుల్లో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్‌సింగ్, సెర్ప్ ఏపీఎం దుర్గారావు, సీసీ ఖమ్మంపాటి నర్సింహారావు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆర్థిక పునరావాస పథకం ద్వారా దివ్యాంగులకు స్వయం ఉపాధి, పునరావాసం, కుటీర పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు https: tgobmms. cgg. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బేటీ బచావో.. బేటీ పడావో పోస్టర్ల ఆవిష్కరణ..
కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. అడపిల్లలను రక్షించడంతో పాటు లింగ ఆధారిత అసమానతలను తొలగించేలా అందరూ కృషి చేయాలని కోరారు. బాలికల రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, బాలల సంరక్షణ అధికారి హరికుమారి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ సంతోష్ రూప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment