పోలీస్ అధికారుల సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ
కొత్తగూడెంటౌన్: జిల్లా పోలీసు అధికారుల సంఘం క్యాలెండర్‌ను ఎస్పీ బి.రోహిత్‌రాజ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు అఽధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, కార్యాలయ ఏఓ మంజ్యూనాయక్, ఆర్‌ఐలు కృష్ణారావు, నర్సింహారావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఏసోబు, నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, జానీమియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment