పెద్దమ్మతల్లికి చీర, సారె సమర్పణ
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శివాలయంలో ఈనెల 10న విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాల పాల్వంచలోని శ్రీ షిరిడీ సాయిబాబా, మైసమ్మతల్లి ఆలయాల నుంచి డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పెద్దమ్మతల్లి అమ్మవారికి చీర, సారె, చలివిడి తీసుకొచ్చి సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు పురాణం పవన్‌కుమార్‌శాస్త్రి, దినకరశాస్త్రి, స్థానికులు ముత్యాల కోటేశ్వరరావు, వంగ రమేష్, శరత్, ఎస్‌వీఆర్‌కే.ఆచార్యులు, బాదర్ల జ్యోషి, మహిపతి రామలింగం, చింత నాగరాజు, గందం నర్సింహారావు, బాలాజీ పాల్గొన్నారు.
సామూహిక కుంకుమ పూజ..
పుష్కర మహాకుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్దమ్మతల్లి ఆలయంలో గణపతి పూజ, పుణ్యావాచనం, మూలమంత్ర మహోం, ప్రతిష్ఠామూర్తుల ఊరేగింపు, పంచామృతాభిషేకం గావించారు. ఆ తర్వాత సామూహిక కుంకుమార్చన, చండీ హోమం జరిపించారు. అనంతరం శ్రీకనకదుర్గ అమ్మవారికి మహిళా భక్తులు చీర, సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి చీర, సారె సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment