● దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి
ఖమ్మంగాంధీచౌక్: మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో వివిధ ఆలయాల ఈఓలు, అర్చకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు కానున్నందున చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాక తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే, భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఈ వెంకటేశ్వర్లు, ఈఓలు కొత్తూరు జగన్మోహన్‌రావు, సమత, వీ.వీ.నర్సింహారావు, నలమోతు శేషయ్య, చుండూరు రామకోటేశ్వరరావు, సుదర్శన్, కె.వేణుగోపాలాచార్యులు, హరిచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment