![బైక్ కొనివ్వలేదని.. యువకుడి ఆత్మహత్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09asp21-192004_mr-1739127470-0.jpg.webp?itok=IkZ2KESu)
బైక్ కొనివ్వలేదని.. యువకుడి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: ద్విచక్రవాహనం కొనివ్వలేదని ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరనానికి పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని ఫైర్ కాలనీకు చెందిన చీకటి స్వామి(20) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే తనకు బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గత కొద్ది రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక అగ్ని మాపక కేంద్రంలో స్వీపరుగా పని చేసే తల్లి వరలక్ష్మి కేంద్రానికి వెళ్లగా.. అదే సమయాన స్వామి తల్లి వద్దకు వెళ్లి ఖర్చులకు డబ్బులు అడుగగా.. ఇంటికి వచ్చాక ఇస్తానని చెప్పడంతో ఆమెతో వాగ్వాదం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తల్లి చూసే సరికి ఉరివేసుకొని కనిపించడంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వా రంతా అక్కడకు వచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో తండ్రి కొండయ్య చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, దంపతులకు ఒక్కడే సంతానం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు.
తల్లితో గొడవ తట్టుకోలేక బాలిక..
భద్రాచలంఅర్బన్: తల్లితో గొడవపడి ఓ బాలిక (14) ఆత్మహత్య చేసుకుంది. భద్రాచలం టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక శనివారం రాత్రి తన తల్లి విజయలక్ష్మితో గత రెండు, మూడు రోజుల నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆ బాలిక తట్టుకోలేక ఆదివారం ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతిరాలి తల్లి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment