జామాయిల్ కర్రలు పట్టివేత
జూలూరుపాడు: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గంగులనాచారం గ్రామం రాజుపాలెం అటవీ బీట్ ప్లాంటేషన్‌లోని జామాయిల్ చెట్లు నరికి కర్రలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జామాయిల్ కర్రలను తరలిస్తున్నారనే సమాచారంతో అటవీ సెక్షన్ ఆఫీసర్ వి.మల్లయ్య, బీట్ ఆఫీసర్లు బి.నరసింహారావు, ఎస్‌కె.రహీంలు ట్రాక్టర్ పట్టుకొని, జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయానికి తరలించారు. సురారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ట్రాక్టర్‌లో జామాయిల్ కర్రలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు చెప్పారు. వీటి విలువ సుమారు రూ.15 వేలు ఉండొచ్చని, ట్రాక్టర్‌ను సీజ్ చేసి, విచారణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment