![రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09mng41-192053_mr-1739127472-0.jpg.webp?itok=_xCwE6Jo)
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
మణుగూరుటౌన్: రోడ్డు దాటుతుండగా మోటార్‌సైకిల్ ఢీకొని ఓ వృద్ధురా లు మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. తోగ్గూడెం గ్రామానికి చెందిన భూక్య కమలమ్మ(69) శనివారం రాత్రి రోడ్డు దాటుతుండగా, మణుగూరు నుంచి అశ్వాపు రం వైపు వెళ్తున్న ఓ మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో వృద్ధురాలికి తీవ్రగాయాలు కాగా, సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందు తూ మృతి చెందిందని, మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడు. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మృతురాలి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు ప్రదీప్‌కుమార్ (34) వ్యక్తిగత కారణాలతో కిలోమీటర్ నంబర్ 529/16–18 వద్ద దిగువ లైన్‌లో వెళ్తున్న జైపూర్ – చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment