ఖమ్మం మామిళ్లగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఆదివారం ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులు నరమేధం సృష్టించారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అంటున్నారని, అయితే ఇందులో మావోయిస్టులు ఎందరో, అమాయక ఆదివాసీలు ఎందరో అనే వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో విదేశీ శత్రువులపై యుద్ధం ప్రకటించినట్టుగా కేంద్ర ప్రభుత్వం బస్తర్‌పైన, మావోయిస్టు ఉద్యమం పైనా విరుచుకుపడుతోందని ఆరోపించారు. 70 వేల మంది బలగాలు, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌తో అడవిని జల్లెడ పడుతున్నారని, ఆదివాసీ గ్రామాలను తగలబెడుతున్నారని పేర్కొన్నారు. నక్సలైట్ ఉద్యమాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా కాకుండా అంతర్గత భద్రతా ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌లో జరిగే నరమేధంపై నిరసన తెలపకుంటే బీజేపీ, ఫాసిస్ట్‌లు ఇక ముందు ప్రజాస్వామికవాదులు, భిన్న సంసృతులు, భిన్నాభిప్రాయాలు ఉన్న వారిని సైతం ఇలాగే నిర్మూలిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు..
Comments
Please login to add a commentAdd a comment