‘పరిషత్‌’ లెక్క తేలింది.. | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ లెక్క తేలింది..

Published Tue, Feb 11 2025 2:02 AM | Last Updated on Tue, Feb 11 2025 2:02 AM

‘పరిషత్‌’ లెక్క తేలింది..

‘పరిషత్‌’ లెక్క తేలింది..

● జిల్లాలో 6,81,174 మంది ఓటర్లు ● తుది జాబితా ప్రకటించిన అధికారులు ● ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం ● జిల్లాలో 1,253 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం

చుంచుపల్లి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితాల రూపకల్పనతో పాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని 22 గ్రామీణ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు. జిల్లాలో 6,81,174 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో పురుషులు 3,31,336 మంది, మహిళలు 3,49,816 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 1,253 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలు..

జిల్లాలో 236 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేలా అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి భద్రాచలం మండలం కొత్తగా ఏర్పాటు కానుంది. గత నాలు గైదు రోజులుగా సాధారణ ఓటర్ల జాబితాల ఆధారంగా పరిషత్‌ ఓటర్ల గుర్తింపుపై కసరత్తు చేసిన పంచాయతీరాజ్‌ అధికారులు.. ఆయా మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో తుది జాబితాలను అందుబాటులో ఉంచారు. పంచాయతీల కంటే ముందుగానే మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈనెల 12న ఐడీఓసీలో సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. రిజర్వేషన్‌ ప్రకారం మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించేలా వెసులుబాటు కల్పిస్తారు.

మండలాల వారీగా ఓటర్ల వివరాలు

ఆళ్లపల్లి 9,285 గుండాల 13,287

అన్నపురెడ్డిపల్లి 16,962 జూలూరుపాడు 28,070

అశ్వాపురం 33,564 కరకగూడెం 12,879

అశ్వారావుపేట 30,805 లక్ష్మీదేవిపల్లి 32,854

భద్రాచలం 41,008 మణుగూరు 37,229

బూర్గంపాడు 50,420 ములకలపల్లి 28,236

చండ్రుగొండ 23,893 పాల్వంచ 29,107

చర్ల 32,744 పినపాక 27,324

చుంచుపల్లి 39,758 సుజాతనగర్‌ 23,438

దమ్మపేట 44,687 టేకులపల్లి 42,040

దుమ్ముగూడెం 36,772 ఇల్లెందు 46,812

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement