![క్రీడ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/0000634972-000001-yashodahospita_mr-1739218556-0.jpg.webp?itok=NooyO2gk)
క్రీడలతో మానసికోల్లాసం
అశ్వాపురం: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు చైర్మన్ దినేష్‌కుమార్ శుక్లా అన్నారు. మండల కేంద్రంలోని భారజల కర్మాగారం ఆధ్వర్యంలో భారత అణుశక్తి విభాగం(డీఏఈ) స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌లో భాగంగా బ్యాడ్మింటన్ పోటీలను భారజల బోర్డు చైర్మన్ సత్యకుమార్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి క్రీడా పోటీలతో ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు. బోర్డు చైర్మన్, సీఈ సత్యకుమార్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. కాగా, పోటీలకు భారత అణుశక్తి విభాగంలోని ఎనిమిది కర్మాగాల నుంచి అజంతా, ఎల్లోరా, పుష్కర్, నాగార్జున, గోల్కొండ, కోణార్క్, ద్వారకా, రామేశ్వరం జట్లు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ ముదిత్ శ్రీవాత్సవ, భారజల కర్మాగారం జీఎం హెచ్‌కే.శర్మ, కో కన్వీనర్ రఫిక్ అహ్మద్, సీఏఓ వేణు తదితరులు పాల్గొన్నారు.
![క్రీడలతో మానసికోల్లాసం1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10mng21-192013_mr-1739218556-1.jpg)
క్రీడలతో మానసికోల్లాసం
Comments
Please login to add a commentAdd a comment