![గిరిజనుల చెంతకు సంక్షేమ పథకాలు..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bcm02-192041_mr-1739218557-0.jpg.webp?itok=HRht87ec)
గిరిజనుల చెంతకు సంక్షేమ పథకాలు..
● ఆదివాసీల జీవనశైలి ఉట్టిపడేలా మ్యూజియం ● ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనుల చెంతకు చేర్చేలాఅధికారులు పాటుపడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హతల ఆధారంగా పరిష్కరించాలని తెలిపారు.
ఆకట్టుకునేలా ఉండాలి
ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో వస్తువులు, చిత్రాలు ఆదివాసీల జీవన శైలి ఉట్టిపడేలా ఉండాలని పీఓ రాహుల్ తెలిపారు. మ్యూజి యం లోపల, ముఖద్వారం వద్ద వేస్తున్న చిత్రాలను పరిశీలించిన ఆయన క్రాఫ్ట్ టీచర్లకు సూచనలు చేశారు. గిరిజనుల జీవన విధానం, వారి దుస్తులు, అలంకరణ, వృత్తులు, పూజా విధానం చిత్రాల ద్వారా తెలిసేలా ఉండాలని చెప్పారు. ఆతర్వాత బాక్స్ క్రికెట్ ఏర్పాట్లపై ఆరా తీసిన పీఓ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేయడానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లను పరిశీలించారు. ఈకార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, వివిధ విభాగాల అధికారులు గోపాలరావు, చంద్రశేఖర్, రవీంద్రనాథ్, ఉదయ్‌భాస్కర్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయ్‌కుమార్, మణిధర్, సమ్మయ్య, ఆదినారాయణ, నారాయణరావు, లింగానాయక్, వీరస్వామి, బేబీ సునంద, సరస్వతి, రాంబాబు, మూర్తి, చలపతిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment