![విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10yld185-192011_mr-1739218556-0.jpg.webp?itok=sj2gArlR)
విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: విజ్ఞాన శాస్త్రంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, ప్రతిభా పాటవ పోటీలు అందుకు దోహదం చేస్తాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు భౌతిక శాస్త్రాన్ని ఆసక్తితో అభ్యసించాలని, సమాజానికి అవసరమైన నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. జయాపజయాలను సమానంగా స్వీకరించాలని, ఇలాంటి పోటీల్లో పాల్గొనడమే గొప్ప విజయంగా భావించాలని సూచించారు. ఈ పోటీల్లో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎన్.గీత ప్రథమ, సారపాక ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వల్లిశ్రీ అశ్విని ద్వితీయ, భద్రాచలం జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని వై. హాసిని తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. వీరు ఈనెల 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ప్రతిభాపాటవ పోటీకి ఎన్నికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కార్యదర్శి ఎస్.మాధవరావు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్‌కే సైదులు, ఎఫ్‌పీఎస్‌టీ అధ్యక్షులు షేక్ ఎల్.అమిరుద్దీన్, ప్రధాన కార్యదర్శి బి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ
టేకులపల్లి: ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని నెల్లూరి గీత జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొంది రాష్ట్ర స్థాయి పోటీకి అర్హత సాధించింది. ఈ మేరకు డీఈఓ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. కాగా, గీతతో పాటు ఫిజిక్స్ టీచర్ ఎం.మోహన్‌రావును హెచ్‌ఎం మేరుగు శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment