![సమస్యలు సత్వరమే పరిష్కరించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mng25-192013_mr-1739218558-0.jpg.webp?itok=FkHpj5AB)
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలంలోని పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా పలు పనులు చేపట్టగా బిల్లులు మంజూరు కాలేదని కాంట్రాక్టర్ రాములు ఇచ్చిన ఫిర్యాదును ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల పంచాయతీ పరిధిలోని గంగమ్మ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, తమ పిల్లలకు ఆధార్‌కార్డుల మంజూరుకు జనన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని స్థానికులు కోరగా కలెక్టరేట్ డి సెక్షన్ సూపరింటెండెంట్, విద్యుత్ ఎస్‌ఈలకు ఎండార్స్ చేశారు.
జాతీయ పోటీలకు ఎంపిక
అశ్వాపురం: కొత్తగూడెం క్లబ్‌లో ఈనెల 9 వరకు జరిగిన తెలంగాణ మాస్టర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అశ్వాపురానికి చెందిన చంద్రకళ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలవగా.. మార్చిలో గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ రాహుల్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, కార్యదర్శి రాజేందర్, డాక్టర్ సావిత్రి చేతుల మీదుగా బహుమతి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment