ముంబై: స్టాక్ మార్కెట్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం సైతం సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం సాయంత్రం 52,568 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు ఉదయం 52,508 పాయింట్ల మొదలైంది. ఆ తర్వాత దిగువకు పడిపోతూ 52,229 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత కొంచెం పుంజుకుంది. ఉదయం 9:45 గంటల సమయంలో 52,238 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా 330 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15,668 పాయింట్ల దగ్గర ప్రారంభమై ఉదయం 9:45 గంటల సమయంలో 15,646 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా 81 పాయింట్లు నష్టపోయింది.
బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఐటీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోయాయి. అయితే స్మాల్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీలో స్మాల్ క్యాప్ కంపెనీలు 0.10 శాతం లాభాలు పొందగా బ్యాంక్‌నిఫ్టీ 0.92 శాతం పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment