ముంబై: స్టాక్ మార్కెట్‌లో నూతన ఏడాదిలో ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి సూచీల వరుస ర్యాలీతో ఇన్వెస్టర్లు భారీ లాభాల్ని ఆర్జించారు. గడచిన నాలుగు రోజుల్లోనే స్టాక్ మార్కెట్లో రూ.9.30 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బుధవారం ఒక్కరోజే 1.04 లక్షల కోట్లు జమయ్యాయి. దీంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.272.44 లక్షల కోట్లకు చేరింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 2,429 పాయింట్లు, నిఫ్టీ 721 పాయింట్లు ర్యాలీ చేశాయి.
బుధవారం మార్కెట్లో మరిన్ని సంగతులు
∙ అమెజాన్ ఆర్బిట్రేషన్ పిటిషన్ రద్దు చేయడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఫలితంగా ఫ్యూచర్ సప్లై సొల్యూషన్స్, ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ షేర్లు నాలుగు శాతం, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజర్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ షేర్లు 3–2 శాతం చొప్పున క్షీణించాయి.
∙ ఇండిగో, స్పెస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ షేర్లు నాలుగు శాతం మేర నష్టపోయాయి. ఒమిక్రాన్ కట్టడికి పలు దేశాలు విమాన ప్రయాణాలపై నిషేధం విధించడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
∙ మూడో క్వార్టర్ (అక్టోబర్–డిసెంబర్)లో రుణాల వృద్ధి 11% నమోదైనట్లు బంధన్ బ్యాంకు ప్రకటించింది. ఫలితంగా ఈ బ్యాంక్ షేరు నాలుగు శాతం లాభపడి రూ. 263 వద్ద స్థిరపడింది.
చదవండి: జస్ట్ 2 రోజుల్లోనే..సుమారు రూ. 5.36 లక్షల కోట్లను...
Comments
Please login to add a commentAdd a comment