గత వారం స్టాక్ మార్కెట్‌లో 9 దిగ్గజ కంపెనీలు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటైలైజేషన్ వ్యాల్యూ భారీగా పడిపోవడంతో లక్షల కోట్లు బూడిద పాలయ్యాయి. టాప్-9 జాబితాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడింది. మిగిలిన కంపెనీలు భారీ నష్టాల్ని చవిచూశాయి.
వాటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ రూ.18,069.87 కోట్లు తగ్గి రూ.12,85,660.79 కోట్లకు చేరుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎం-క్యాప్ రూ.12,321.11 కోట్లు క్షీణించి రూ.5,29,236.66 కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.9,816.28 కోట్లు క్షీణించి రూ.4,01,367.04 కోట్లకు చేరుకుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.9,409.46 కోట్లు తగ్గి రూ.5,29,606.94 కోట్లకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.7,904.08 కోట్లు తగ్గి రూ.8,52,532.36 కోట్లకు చేరింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ.6,514.96 కోట్లు తగ్గి రూ.4,49,755.80 కోట్లకు చేరుకోగా, బజాజ్ ఫైనాన్స్ రూ.5,166.77 కోట్లు తగ్గి రూ.4,52,188.74 కోట్లకు చేరుకుంది.
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.2,196.87 కోట్లు తగ్గి రూ.5,63,349.75 కోట్లకు చేరుకుంది.
విరుద్ధంగా ఇన్ఫోసిస్ రూ. 294.39 కోట్లు జోడించి విలువ రూ. 7,48,875.37 కోట్లకు చేరింది.
చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!
Comments
Please login to add a commentAdd a comment