కరోనా మహమ్మారి ప్రభావంతో 2020లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ ఏడాది చాలా మొబైల్ తయారీ కంపెనీలు సరఫరా, అమ్మకం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. షియోమీ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే అమ్మకాల విషయంలో మెరుగైన స్థితిలో ఉన్న, శామ్‌సంగ్ కి మాత్రం ఇది మరిచిపోని ఏడాదిగా మిగిలిపోనుంది. జీఎస్‌ఎమ్ ఏరిన నుండి వచ్చిన మొబైల్ అమ్మకాలకి సంబందించిన నివేదిక ప్రకారం.. 2020లో శామ్‌సంగ్ 300 మిలియన్ల ఫోన్ అమ్మకాల మార్కును అందుకోలేకపోయిందని అంచనా.(చదవండి: పిక్సెల్ 6లో అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా)
ఈ ఏడాదిలో 270 మిలియన్ల మొబైల్ ఫోన్లను శామ్‌సంగ్ సేల్ చేసినట్టు సమాచారం. ఒకవేల ఇది నిజమైతే, గత 9 సంవత్సరాలలో ఫోన్ అమ్మకాలు 300 మిలియన్ల మార్కును అందుకోలేకపోవడం శామ్‌సంగ్ కి ఇదే మొదటిసారి. నివేదిక ప్రకారం.. 2020 మూడవ త్రైమాసికం చివరి నాటికీ 189 మిలియన్ ఫోన్‌లను రవాణా చేసినట్లు శామ్‌సంగ్ ధృవీకరించింది. ఈ ఏడాది కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఈ సంఖ్య గణనీయమైనదే అయిన అనుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోక లేకపోయింది. అక్టోబర్ లో వచ్చిన గెలాక్సీ నోట్ 20 సిరీస్ కు 9 లక్షల డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. కానీ, వాస్తవానికి 6 లక్షల అమ్మకాలు జరిగాయి. ఏదేమైనా, 2021లో శామ్‌సంగ్ తన మిడ్-రేంజ్, లో-ఎండ్ మొబైల్స్ లో 5జీ టెక్నాలజీ తీసుకోని రావడం ద్వారా 307 మిలియన్ యూనిట్లను అమ్మాలనే లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది. చూడాలి మరి వచ్చే ఏడాది శామ్‌సంగ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో.
Comments
Please login to add a commentAdd a comment