దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 23,595కు చేరింది. సెన్సెక్స్ 209 పాయింట్లు ఎగబాకి 77,549 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.51 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.31 శాతం, నాస్‌డాక్ 1.07 శాతం నష్టపోయాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ రేటింగ్స్ తెలిపింది. 2023-24లో భారత్ 8.2 శాతం వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. 2025-26లో 6.9%, 2026-27లో 7 శాతం వృద్ధి నమోదుకావొచ్చని వెల్లడించింది.
క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌పై విచారణ
ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌పై సెబీ విచారణ చేపట్టింది. సెబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. క్వాంట్‌కు చెందిన ముంబయి, హైదరాబాద్ కార్యాలయాల్లో సెబీ సోదాలు జరిపి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్టాక్ బ్రోకర్ లేదా విశ్లేషకుల నుంచి కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుని లావాదేవీలు చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా పరిగణిస్తారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment