దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 23,833కు చేరింది. సెన్సెక్స్ 151 పాయింట్లు పెరిగి 78,517 వద్ద ట్రేడవుతోంది. వరుసగా వచ్చిన మూడు రోజుల లాభాలకు గురువారం ఉదయం బ్రేక్ పడింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.99 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్‌డాక్ 0.48 శాతం పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి మించి వృద్ధిని నమోదు చేస్తుందని, వృద్ధిరేటు 7.5 శాతం సమీపానికీ చేరొచ్చని ఎన్‌సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) తన నెలవారీ సమీక్షలో వెల్లడించింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు లేకపోవడం, దేశీయంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఈ అభిప్రాయాన్ని తెలిపింది. దానికితోడు బ్యాంకింగ్‌రంగం, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ స్టాక్‌లు పుంజుకోవడంతో మార్కెట్లు మంగళవారం లాభాల్లోకి చేరుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment