దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 24,116కు చేరింది. సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 79,475 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.03 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం, నాస్‌డాక్ 0.30 శాతం పెరిగాయి.
జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో గురువారం షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయని నిపుణులు చెబుతున్నారు. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయంటున్నారు. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
జీవితకాల గరిష్ఠానికి ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్‌టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది.
ర్యాలీ ఇలా..
నిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం
20,000 51 రోజులు
21,000 60 రోజులు
22,000 25 రోజులు
23,000 88 రోజులు
24,000 25 రోజులు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment