దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 24,031కు చేరింది. సెన్సెక్స్ 20 పాయింట్లు పెరిగి 79,046 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.85 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం, నాస్‌డాక్ 0.7 శాతం నష్టపోయాయి.
స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు.
జూన్ జీఎస్‌టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్‌బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment