దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 24,188కు చేరింది. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 79,645 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.27 శాతం, నాస్‌డాక్ 0.83 శాతం లాభపడ్డాయి.
స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయులు నమోదు చేస్తున్నాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌ఐఐలు డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 83 శాతం నెట్ లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపితే మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
జూన్ జీఎస్‌టీ వసూళ్లు మే నెలతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. జూన్‌లో రూ.1.74లక్షల కోట్లు వసూళయ్యాయి. జూన్ నెలలో ఆటో కంపెనీల వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మొత్తం జూన్‌లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3,28,710 యూనిట్లు విక్రయించారు. 3.67 శాతం వృద్ధి మాత్రమే నమోదైనట్లు డేటా ద్వారా తెలిసింది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్‌బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment