దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 24,257కు చేరింది. సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 79,929 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.62 శాతం, నాస్‌డాక్ 0.84 శాతం లాభపడ్డాయి.
స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయులు నమోదు చేస్తున్నాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌ఐఐలు డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 83 శాతం నెట్ లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపితే మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం దూసుకుపోతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్‌కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment