![సమస్య పరిష్కరించుకున్న కుటుంబీకులతో న్యాయమూర్తి శ్రీనివాసరావు తదితరులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/25plnr06-300060_mr_0.jpg.webp?itok=DC_I9ao-)
సమస్య పరిష్కరించుకున్న కుటుంబీకులతో న్యాయమూర్తి శ్రీనివాసరావు తదితరులు
● న్యాయమూర్తి చొరవతో ఒక్కటైన కుటుంబం
పలమనేరు: సాధారణంగా క్రిమినల్ కేసుల పరిష్కా రానికి ఏళ్ల తరబడి వేచిచూడాల్సిందే. కానీ పలమ నేరు సీనియర్ సివిల్ జడ్జి చొరవతో ఓ క్రిమినల్ కేసు కోర్టుకొచ్చిన వారానికే పరిష్కారమైంది. ఈ సంఘట న శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బైరెడ్డిపల్లి మండలం కు మ్మరకుంటకు చెందిన గంగరాజులు, భాగ్యమ్మ భా ర్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భర్త గంగరాజు లు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దీంతో పాలకోవాలో ఎలుకలమందును కలిపి తనతోపాటు పిల్లలకు తినిపించి ఆత్మహత్యాయత్నాని కి పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవతో సొంత పిల్లల్ని సైతం చంపాలని చూసిన కుమారుడిపై తండ్రి నాగ ప్ప బైరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు స్థానిక కోర్టులో ఈ నెల 17వ తే దీన ఎస్‌సీ 351/23గా నంబరైంది. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి పగడాల శ్రీనివాసరావు ముద్దాయి గంగరాజులు, అతని భార్యపిల్లలు, ఫిర్యాదీ నాగప్ప కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చారు. కేసులతో కలిగే ఇబ్బందులను వివరించి రాజీ కుదిర్చారు. తమ కుటుంబాన్ని కలిపినందుకు వారు జడ్జికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపీ రంజిత్‌షా, న్యాయవాది రంజిత్‌కుమార్, లైజనింగ్ ఆఫీ సర్ రమేష్, కానిస్టేబుల్ సునీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment