అభివృద్ధి పనులు పరిశీలించిన పెద్దిరెడ్డి
సదుం: మండల కేంద్రంలోని సంతలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. సంతలో సరైన సౌకర్యాలు లేక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతుండడంపై స్పందించిన ఎ మ్మెల్యే పెద్దిరెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హ యాంలో నిధులు మంజూరు చేయించారు. ఎన్నికల ముందు షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనుల వివరాలను జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి ఆయనకు వివరించారు. అంతకు ముందు చింతపర్తివారిపల్లెలో బాలాజీరెడ్డి గృహంలో జరుగుతున్న శుభకార్యానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతన వధూవరులకు అశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధనుంజయ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వార్డు సభ్యులు భాస్కర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment