‘పరీక్ష పే చర్చ’ వీక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సోమవారం నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమం వీక్షించారని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లో పరీక్ష పే చర్చ కార్యక్రమం ని ర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్ర ధాని మోదీ విద్యార్థులతో పరీక్షల సన్నద్ధంపై సంభాషించినట్లు చెప్పారు. పరీక్షలకు సన్నద్ధం, సలహాలు, సూచనలు పరీక్ష పే చర్చాలో చర్చించారన్నారు. జిల్లాలోని 380 ప్రభుత్వ పాఠశాలలు, 142 ప్రైవేట్ మొత్తం 522 పాఠశాలల్లో 59,601 మంది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు కార్య క్రమం వీక్షించారన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణను ఎంఈఓలు పర్యవేక్షించినట్లు తెలిపారు.
పోలీసు గ్రీవెన్స్‌కు
25 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 25 వినతులు అందాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇళ్లు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
‘పరీక్ష పే చర్చ’ వీక్షణ
Comments
Please login to add a commentAdd a comment