![జెల్లి ఫ్యాక్టరీ మాకొద్దు ప్రభో!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10kpm21-300026_mr-1739218248-0.jpg.webp?itok=HWaFsKX0)
జెల్లి ఫ్యాక్టరీ మాకొద్దు ప్రభో!
కుప్పంరూరల్: కుప్పం మండలం, వరమనూరు వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న జెల్లి ఫ్యాక్టరీ తమకొద్దని గ్రామస్తులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి తెచ్చారు. నూతనంగా కృష్ణదాసనపల్లి పంచాయతీ వరమనూరు వద్ద కొంత మంది వ్యక్తులు జెల్లి ఫ్యాక్టరీ నిర్మాణం చేప ట్టాలని అనుమతులు పొంది ప్రస్తుతం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని, జెల్లి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తమ పొలాలు దెబ్బతింటాయని, తాము ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని జ నం అధికారుల దృష్టికి తెచ్చారు. వరమనూరు గ్రా మంలో అంతా సన్న చిన్నకారు రైతులే ఉన్నారని, అలాంటి భూముల సమీపంలో జెల్లి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే సర్వం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అధికారులు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెల్లి ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకోవాలని వినతిలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment