ప్రయోగాలతో మేధస్సుకు పదును
శాంతిపురం: కొత్త విషయాలు తెలుసుకోవాలని, సరికొత్త ఆవిష్కరణలు చేయాలనే తపనతోనే విద్యార్థుల మేధస్సుకు పదును పెరుగుతుందని వక్తలు చెప్పారు. కూతేగౌనిపల్లి వద్ద ఉన్న శ్రీపరమహంస యోగానంద విద్యాలయలో మూడు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ బుధవారం ముగిసింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హబ్ అండ్ స్పోక్ అంశంపై 12 జిల్లాలకు చెందిన 60 మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, జిల్లా సైన్స్ అధికారి ఆర్‌వి రమణారెడ్డి, కడా పీఓ వికాస్ మర్మత్ ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రసంగించారు. సరైన మార్గదర్శకుల ప్రోత్సాహం నుంచే కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నారు. అటల్ ల్యాబ్‌ల ఏర్పాటు కారణంగా పిల్లలకు గణిత, జీవ, రసాయన, భౌతిక శాస్త్ర ప్రయోగాలపై ఆసక్తి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మెంబర్ భువనేశ్వరి, విద్యాలయ కరస్పాండెంట్ గోపాల్ అగర్వాల్, ప్రిన్సిపాల్ ఆజాద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment